నవంబరు 3న నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌టీఎస్‌ఈ) లెవల్-1 పరీక్షల కోరకు జిల్లాలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబరు 10వరకు పొడిగించినట్లు పరీక్షల విభాగం ఎసీ శ్రీదేవి తెలిపారు. పదోతరగతి విద్యార్థులకు జిల్లాలో గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ గుర్తింపు పాఠశాలల విద్యార్థులు అర్హులన్నారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతిగృహం లేని ఆదర్శపాఠశాలలో చదువుతున్న 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌కు అర్హులన్నారు. ఎన్‌టీఎస్‌ఈకు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా రూ.200 పరీక్షా రుసుం, ఎన్‌ఎంఎంఎస్‌కు బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రూ.50 చలానా రూపంలో తీసుకోవాలని, వీటిని సంబంధిత హెచ్‌ఎంలు 14వతేదీ లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాli
No comments:
Post a Comment