దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీలోకి ఉద్యోగులుగా ప్రవేశించేందుకు సాధారణ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం వచ్చింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్‌ఐసీ ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు ఉన్న జోన్ పరిధిలో 630కి పైగా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్షలో మెరిట్ సాధిస్తే కొలువులో చేరిపోవచ్ఛు ఇంటర్వ్యూలేదు.
దేశవ్యాప్తంగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన నిరుద్యోగులకు వరం. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు.
ఏపీ, తెలంగాణల్లోని ఎల్‌ఐసీ ఆఫీసులు సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తాయి. జోన్ పరిధిలో డివిజన్లు, డివిజన్ల కింద బ్రాంచీలు ఉంటాయి. డివిజన్లవారీ నియామకాలు చేపడతారు. అభ్యర్థి నచ్చిన డివిజన్‌ను ఎంచుకోవాలి. పరీక్ష అక్కడే రాయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు మొదటి మూడేళ్లు ఆ డివిజన్ పరిధిలోని బ్రాంచిలో చేరి, 6 నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం శాశ్వత ఉద్యోగిగా తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి రూ.14,435 మూలవేతనం లభిస్తుంది. హైదరాబాద్ లాంటిచోట అలవెన్సులన్నీ కలిపి రూ.30,000 వేతనం పొందవచ్ఛు ఎంపికైనవారు బ్రాంచీ అవసరాలకు అనుగుణంగా అసిస్టెంట్, క్యాషియర్, సింగిల్ విండో ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లలో ఏదో ఒక బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది.
మెయిన్స్‌లో నాలుగు విభాగాలు
ఇందులో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిని 35 నిమిషాల్లో పూర్తిచేయాలి. జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. వీటిని 35 నిమిషాల్లో పూర్తిచేయాలి.క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 40 నిమిషాల్లో పూర్తిచేయాలి..రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

వంద ప్రశ్నలతో ప్రిలిమ్స్
ప్రిలిమినరీ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1 లో ఇంగ్లిష్/ హిందీ భాష నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటిని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్-2లో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. వీటిని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్-3లో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు. వీటిని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. అర్హుల జాబితా నుంచి విభాగాల వారీ ఖాళీలకు గరిష్ఠంగా 20 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

తుది ఎంపిక: మెయిన్స్‌లో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 1.
వెబ్‌సైట్: https:// licindia.in
No comments:
Post a Comment